Loading...
JAI BHIM WELFARE ASSOCIATION

ABOUT ASSOCIATION

మీరు సామాజిక స్వేచ్ఛను సాధించనంత కాలం, చట్టం ద్వారా ఏ స్వేచ్ఛను అందించినా ప్రయోజనముండదు.

డా. బి. ఆర్. అంబేద్కర్.

సమైక్య తో ఆర్థిక అభివృద్ధి కోసం జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.

జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్న, వారికి ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక పరంగా అభివృద్ధి చెందటానికి సలహాలు సూచనలు జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ అందిస్తుంది.

జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకున్నవారు మీ ప్రాంతంలోఎక్కడైనా మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మీరు ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు, లక్ష్యానికి అనుగుణంగా మీకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది. మరియు మీరు ఆర్థికంగా వృద్ధి చెందటానికి జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ లోని వారందరినీ భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నిస్తుంది.

జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని భావించే వారు మీ షాపు కి జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్షిప్ కార్డు తీసుకొని వచ్చిన వారికి, ఆర్థికంగా అభివృద్ధి పొందాలనుకున్న యజమాని సాధ్యమైనంత డిస్కౌంట్ ఇచ్చినట్లయితే, జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరూ మీ షాప్ కు రావడం వలన మీరు ఆర్థికంగా వృద్ధి చెందుతారు.

మీరు సూపర్ మార్కెట్ గాని, కూరగాయలు గాని,etc.. సమాజానికి నష్టం కలగకుండా మీరు ఆర్థిక అభివృద్ధి చెందాలని భావించినట్లు అయితే మీకు రోజువారి ఆర్థిక అభివృద్ధి తో పాటు,ఆ ప్రాంతంలో నివసించే వారికి ఏ ఫంక్షన్ జరిగిన మీ షాప్ నుంచి వస్తువులు కొనుగోలు చేయడనికి సభ్యత్వం కార్డు తీసుకొచ్చిన వారికి మీకు సాధ్యమైనంత డిస్కౌంట్ ఇవ్వండి.

పట్టణాల్లో నివసించే వారు జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోవడం వల్ల మీరు వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా మీకు కావలసిన నిత్యవసర వస్తువులు బియ్యం, కందిపప్పు, మినుములు, సెనగలు, మిరపకాయలు, పసుపు, అరటికాయలు, మరియు ఇతర వస్తువులు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులను రైతు వద్ద మీరు పొందడానికి మెంబెర్షిప్ కార్డ్ తో లాగిన్ అయ్యి మీకు ఏ వస్తువు కావాలో పోస్ట్ చేసినట్లయితే ఆ వస్తూ పండించే రైతుల యొక్క ఫోన్ నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల రైతుకి లాభం కలుగుతుంది అదేవిధంగా వినియోగదారుడికి నాణ్యమైన వస్తువులు లభిస్తుంది.

పట్టణాల్లో మరియు గ్రామాల్లో నివసించేటువంటి చేతివృత్తుల వారు జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే, ఆ ప్రాంతంలో నివసించే వారు నేరుగా వెబ్ సైట్ లోకి వెళ్లి చేతివృత్తుల వారి కోసం, మెంబెర్షిప్ కార్డ్ తో లాగిన్ అయ్యి, వారికి ఏ చేతివృత్తుల వారు కావాలో పోస్ట్ చేసినట్లయితే ఆ ప్రాంతంలోని చేతివృత్తుల వారి యొక్క ఫోన్ నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా నేరుగా వినియోగదారులు చేతివృత్తుల వారిని సంప్రదిస్తారు, దాని ద్వారా వినియోగదారుడికి పని జరుగుతుంది, చేతివృత్తుల వారికి ఉపాధి కలుగుతుంది.

చదువుకునే విద్యార్థులు మరియు చదువు పూర్తి అయిన విద్యార్థులు మి ఫ్యామిలీ యొక్క జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబెర్ షిప్ కార్డ్ తో వెబ్ సైట్లో మి విద్యార్హత వద్దా మ్యాప్ అయినట్లయితే ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు విద్యార్థులు అందరికీ మెసేజ్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది.

సలహాలు సూచనలు కొరకు ఎటువంటి రుసుము వసూలు చేయబడదు. అసోసియేషన్ లో సభ్యత్వం కోసం మాత్రమే సంవత్సరానికి 100 రూపాయలు సభ్యత్వ రుసుము చెల్లించవలెను .

మీకు ఏ అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్న, జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోవటనికి ఎటువంటి అభ్యంతరం లేదు.

పైన చెప్పిన విధంగా అన్ని జరగటానికి వెబ్ సైట్ లోకి డేటా మొత్తం అందుబాటులోకి రావాలి, డేట వచ్చిన తర్వాత పైన చెప్పిన విధంగా అన్ని సర్వీసులు మేము మీకు అందించగలము.

జై భీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ లో చేరుదాం, సమైక్యంగా అభివృద్ధి చెందుదాం.

డా. బి. ఆర్. అంబేద్కర్

స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యి రెట్లు మేలు.

జ్యోతి రావు ఫూలే

స్వార్థం వివిధ రూపాలను తీసుకుంటుంది. కొన్నిసార్లు కులం, కొన్నిసార్లు మతం.

డా. ఏ. పి. జె. అబ్దుల్ కలాం

నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే.. ముందు సూర్యుడిలా మండటానికి సిద్ధపడాలి

JAI BHIM

ASSOCIATES & ALLIANCES